AKP: ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఉపాధి హామీ పథకంలో 1,600 మొక్కలను నాటుతున్నట్లు ఏపీవో నాగరాజు తెలిపారు. చెరువుగట్లు, రహదారులకు ఇరువైపులా ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలాల్లో మొక్కలను ఉపాధి హామీ సిబ్బంది గ్రామస్తుల సహకారంతో నాటుతున్నట్లు తెలిపారు. వాతావరణ కాలుష్యం నియంత్రణకు మొక్కలు దోహదపడతాయన్నారు.