KRNL: క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే గిఫ్ట్ కార్డు లింకులతో సైబర్ మోసాలు జరుగుతున్నాయని తెలిపారు. వ్యక్తిగత, బ్యాంక్ వివరాలు పంచుకోవద్దన్నారు. ఎవరైనా మోసానికి గురైతే 1930, 100, 102కు కాల్ చేయాలన్నారు.