»Kartik Aaryan Kiara Advanis Get Together With Satyaprem Ki Katha Team
Kiara Advani: మరోసారి కార్తీక్ ఆర్యన్ తో జత కట్టిన కియారా..!
బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ ఇటీవల భూల్ భులాయా2 సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు జోడీగా కియారా అద్వాణీ నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. కాగా ఈ మూవీ హిట్ కావడంతో ఈ జోడీ మరోసారి జంట గా రావడానికి రెడీ అయ్యింది.
వీరిద్దరూ కలిసి తాజాగా ‘సత్య ప్రేమ్ కీ కథ’ సినిమా చేస్తున్నారు. నేషనల్ అవార్డు విన్నర్ సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్ లు సినిమాపై తిరుగులేని హైప్ తీసుకొచ్చాయి. రొమాంటిక్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్రబృందం ట్రైలర్ ను రిలీజ్ చేసింది. లేటెస్ట్ గా రిలీజైన ట్రైలర్ ఆధ్యంతం ఆకట్టుకుంటుంది. పూర్తి స్థాయి ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కినట్లు స్పష్టమైంది. ఇక మరోసారి కార్తిక్, కియారా జోడీ పర్ ఫెక్ట్ గా కుదిరినట్లు అనిపిస్తుంది. ఇక ఎమోషన్స్ కూడా బాగానే దట్టించినట్లు తెలుస్తుంది. దాంతో పాటుగా కార్తిక్ స్టైల్ ఆఫ్ కామెడీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతుందని ట్రైలర్ తో అర్థమైంది.
సత్యప్రేమ్ గా కార్తిక్ ఆర్యన్ కనిపించగా.. కథ పాత్రలో కియారా నటించనట్లు తెలుస్తుంది. వీళ్లిద్దరి పరిచయం, ప్రేమ, పెళ్లి, మనస్పర్థలు, భావోద్వేగాల సమ్మేళ్లనంగా సినిమా ఉండబోతుందని ట్రైలర్ తో స్పష్టమయింది. తన ప్రేమ ను గెలిపించుకునేందుకు సత్య ప్రేమ్ ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? అన్నది థియేటర్లలో చూడాలి. సవాళ్లు ఎదురవ్వని ప్రేమకథలో అంత కిక్కుండదు. కానీ సత్య ప్రేమ్ లవ్ స్టోరి లో కిక్కు ఉందా లేదా అన్నది తెర పైనే చూసి తెలుసుకోవాలి. సమీర్ విద్వాన్స్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సాజిద్ నడియాద్వాలా సమర్పణలో నమః పిక్చర్స్ నిర్మించింది. ఈ చిత్రాని కి సంగీతం తనిష్క్ బాగ్చి- మనన్ భరద్వాజ్- పాయల్ దేవ్ అందించగా.. అయనంక బోస్ సినిమాటోగ్రఫీని అందించారు.