MHBD: సైబర్ నేరాల నివారణలో భాగంగా ప్రజలకు అవగాహన కల్పించే పోస్టర్లను శుక్రవారం జిల్లా ఎస్పీ డా. శబరీష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా SP మాట్లాడుతూ.. ఆకర్షణీయ ఆఫర్లు, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ నకిలీ యాప్‌లు, వెబ్సైట్ల ద్వారా మోసాలు జరుగుతున్నాయని హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో వీడియో కాల్స్‌ను నమ్మవద్దని, అలాంటివి లేవని స్పష్టం చేశారు.