JGL: పెగడపల్లి మండలంలోని మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు గాను 2 ఏకగ్రీవం అయ్యాయి. దీంతో 21 గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల్లో 15 కాంగ్రెస్, బీఆర్ఎస్ 7, ఇతరులు 1 సర్పంచుల అభ్యర్థులు గెలుపొందారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకులు సంబరాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు.