E.G: పెరవలి మండలం తీపర్రు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ నూతన కమిటీ బుధవారం కొలువుదీరింది. ఆలయ కమిటీ ఛైర్మన్గా యన్నమని ఉదయ భాస్కరరావుతో పాటు మరో 9 మంది సభ్యులు ధర్మకర్తలుగా ప్రమాణ స్వీకారం చేశారు. అర్చకులు వీవీఆర్ శేషాచార్యుల ఆధ్వర్యంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య ఈ కార్యక్రమం సాగింది.