NTR: రాష్ట్రంలో పుస్తక సంబరాలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 2 నుంచి విజయవాడ మున్సిపల్ స్టేడియంలో 36వ బుక్ ఫెస్టివల్ 11 రోజులపాటు జరగనుంది. ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. లక్షలాది పుస్తకాలు, సాహిత్య సదస్సులు, పుస్తకావిష్కరణలు ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రారంభానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ను నిర్వాహకులు ఆహ్వానించారు.