SKLM: ఎచ్చెర్ల మండలం ముద్దాడకు చెందిన ఐదేళ్ల బాలుడు నందన్ లివర్ సమస్యతో బాధపడుతున్నాడు. లివర్ మార్పిడి చెయాలని వైద్యులు సూచించగా.. కుటుంబ సభ్యులు దాతల సహకారం కోసం ఎదురు చూశారు. ఈ విషయాన్ని టెక్కలికి చెందిన ఓ సేవా సంస్థ తెలుసుకుంది. రూ.50 వేలను రూపాయలు బాలుడి తండ్రి రామారావుకు శుక్రవారం సంస్థ సభ్యులు అందజేశారు.