NLG: నల్గొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 6 నుంచి 9వ తరగతి వరకు హిందీ బోధించడానికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పాఠశాల ప్రిన్సిపల్ స్వామి తెలిపారు. అభ్యర్థులు ఎంఏ, బీఏ, హెచ్పీటీ (HPT) విద్యార్హత కలిగి ఉండాలని, డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు దరఖాస్తులను సంబంధిత అధికారులకు సమర్పించాలన్నారు.