VZM: సంతకవిటి మండలం గరికిపాడు సచివాలయాన్ని MRO సుదర్శనరావు ఇవాళ అకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన వెళ్లే సమయంలో మొత్తం 11 మంది సిబ్బందికి కేవలం ఇద్దరే ఉండడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. విధులకు రాని సిబ్బంది సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించారు. సిబ్బంది పనితీరును గ్రామస్థులతో అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు సేవా కేంద్రాన్ని సందర్శించారు.