కృష్ణా: పట్టణాల్లో, గ్రామాల్లో కానీ రహదారులపై జనసంచారం ఉండే ప్రదేశాలలో విగ్రహాలను ఏర్పాటు చేస్తే సుప్రీంకోర్టు వారి మార్గదర్శకాల ప్రకారం వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని బందరు డీఎస్పీ రాజా శుక్రవారం తెలిపారు. బందరు సబ్ డివిజన్ పరిధిలో విగ్రహాలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి అనుమతులు లేవు.కావున ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించాలని ఆయన కోరారు.