Suryanarayana: వాణిజ్య పన్నుల శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగించారనే ఫిర్యాదుపై ఏపీ పోలీసులు (ap police) చర్యలు తీసుకుంటున్నారు. మే 30వ తేదీన పటమట పోలీసులకు ఫిర్యాదు రాగా.. నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేశారు. అయిదో వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్య నారాయణ (Suryanarayana).. ఉద్యోగుల నుంచి వ్యతిరేకత వస్తోందని, ముందు పట్టించుకోలేదు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో అరెస్ట్ చేసేందుకు బయల్దేరారు.
సూర్యనారాయణ (Suryanarayana) అరెస్ట్ చేసేందుకు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. శుక్రవారం విజయవాడ సత్యనారాయణ పురంలో గల ఇంటికి, విద్యాధరపురంలో గల సంఘం కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కూడా లేరు. తనను అరెస్ట్ చేస్తారని సమాచారం తెలిసి ఉంటుంది. అందుకే శుక్రవారం ఉదయమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీంతో పోలీసులు సూర్యనారాయణ ఫోన్లు, సహచరుల కదలికలపై నిఘా పెట్టారు. తలదాచుకునే అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లో వెతుకుతున్నారు. ఇంతకుముందు నలుగురు మోహర్ కుమార్, సంధ్య, చలపతి, సత్యనారాయణను అనే ఉద్యోగులను అరెస్ట్ చేయగా.. వారికి జడ్జీ రిమాండ్ విధించారు. కేసులో ఎవరి పాత్ర ఉందేమో అనే వివరాలు రాబట్టల్సి ఉందని, కస్టడీకి ఇవ్వాలని శుక్రవారం పోలీసులు మూడో ఏసీఎంఎం కోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది.
వాణిజ్య పన్నుల శాఖలో అవకతవకలకు సంబంధించి కేసును విజయవాడ పోలీసు కమిషనర్ కాంతి రాణా (kanth rana) ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. కేసు అప్ డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేర వేస్తున్నారు. గురువారం నలుగురు ఉద్యోగుల అరెస్ట్, రిమాండ్ ప్రక్రియ పూర్తి కాగా.. సూర్య నారాయణను (Suryanarayana) అరెస్ట్ చేయాలని కమిషనర్‌కు పై నుంచి ఆదేశాలు వచ్చాయట. దీంతో రెండు బృందాలను ఏర్పాటు చేశారు. సూర్య నారాయణకు (Suryanarayana) ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉంది.