MHBD: తొర్రూరు పట్టణంలో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ పేరుతో అక్రమ వసూళ్లు చేస్తూ తిరుగుతున్న వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై ఉపేందర్ తెలిపారు. నకిలీ తనిఖీల పేరిట ప్రజలను వేధిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై చర్యలు తీసుకొని నిందితుడిని పట్టుకున్నట్లు తెలిపారు. కేసుపై విచారణ కొనసాగుతోంది.