AP: మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అంధ క్రికెటర్లకు అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, మహిళా క్రికెటర్ల గురించి సీఎం దృష్టికి తీసుకెళ్తానని పేర్కొన్నారు.