AKP: అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేట గ్రామంలో శుక్రవారం మెగా పశువైద్య శిబిరాన్ని నిర్వహించారు. గాలికుంటు వ్యాధితో ఐదు పశువులు మృతి చెందడంతో అధికారులు స్పందించారు. పశువైద్యులు శిబిరంలో పశువులను పరీక్షించి మందులు అందజేసి పాడి రైతులకు పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పశుసంవర్థక శాఖ జేడీ రామ్మోహన్ రావు పశువులకు పట్టేందుకు మినరల్ మిక్చర్ ప్యాకెట్స్ అందజేశారు.