ATP: చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలోని తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించారు. సమస్యలను త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.