కృష్ణా: 6వ అదనపు జిల్లా జడ్జి కోర్టు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఎపీపీ)గా అవనిగడ్డకు చెందిన న్యాయవాది కర్రా సుధాకర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఉత్తర్వులు అందుకున్న సుధాకర్, విజయవాడలోని కృష్ణా జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీమతి విజయలక్ష్మికి ఈరోజు జాయినింగ్ రిపోర్టు అందజేశారు.