»Kota Srinivasarao Criticizes Star Heroes Remuneration And Brand Endorsements
Kota srinivasarao: పవన్ రెమ్యూనరేషన్ పై కోటా షాకింగ్ కామెంట్స్..!
ప్రముఖ సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు(Kota srinivasarao) పలుమార్లు సినీ నిర్మాతలు, స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రవర్సీ కామెంట్స్ చేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. కాగా తాజాగా ఆయన మరోసారి రెమ్యూనరేషన్లు, బ్రాండ్ ఎండార్స్మెంట్ల గురించి స్టార్ హీరోలపై షాకింగ్ కామెంట్స్ చేశాడు.
‘ఇవాళ సినిమా అనేది ఎక్కడ ఉంది.. అంతా సర్కస్ మాత్రం ఉందని సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు(Kota srinivasarao) అన్నారు. విషాద గీతాలకు కూడా డ్యాన్స్ చేస్తున్నారు’ అంటూ కోట హీరోలపై సెటైర్లు వేశారు. ‘ఎన్టీఆర్ ఓ లెజెండ్ అని, మళ్లీ పుడితే తప్ప ఆయనలాంటి వ్యక్తి మరొకరు లేరన్నారు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ANR, కృష్ణ, లేదా శోభన్ బాబు తమ రెమ్యునరేషన్ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ నేడు కొంతమంది హీరోలు రోజుకు రూ.2 కోట్లు, రోజుకు రూ.6 కోట్లు రెమ్యునరేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదని ఆయన అన్నారు. ఆయన ఈ కౌంటర్లు ఇన్ డైరెక్ట్ గా పవన్ మీద వేయడం గమనార్హం.
ఎన్టీఆర్, శ్రీదేవి కలిసి నటించినప్పుడు ప్రేక్షకులు వీరి కాంబినేషన్‌ను ఆస్వాదించే వారు. హీరో వయసు గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. కానీ ఇప్పుడు అలా కాదు అని, ఏజ్ గ్యాప్ గురించి మాట్లాడుతున్నారని కోట అన్నారు. అలాగే హీరోలు చేస్తున్న వాణిజ్య ప్రకటనలపై కూడా కోట శ్రీనివాస రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. హీరోలు బాత్ రూమ్ బ్రష్ ల దగ్గర నుంచి బంగారం వరకు ఏవీ వదలడం లేదు. అన్ని ప్రకటనలు(advertisements) చేసేస్తున్నారు. హీరోలు ఆ స్థాయిలో సంపాదిస్తుంటే మిగిలిన నటులకు సంపాదన ఎలా ఉంటుందని కోట శ్రీవాసరా రావు ప్రశ్నించారు.
సినీ కార్మికుల కోసం చిరు హాస్పిటల్ కడుతున్నాడు అనే విషయంపై మాట్లాడిన కోట..ముందు సినీ కార్మికులకు తిండి పెట్టండి. నీ హాస్పిటల్‌కి ఎవడొస్తాడు. నాకు పని ఉందనుకోండి. నాలుగు డబ్బులొస్తాయి. అపోలో హాస్పిటల్‌కే వెళతారు అంటూ ఘాటుగానే స్పందించాడు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్(viral) గా మారాయి. ఒక్క చిరంజీవి గురించే కాదు. స్టార్ హీరోలందరి గురించి కూడా ఆయన ఎన్నోసార్లు ఘాటు వ్యాఖ్యలే చేశారు.
చిన్న సినిమాలు బతకాలి అంటే ఒక కమిటీ వేసి తెలుగు ఆర్టిస్టులతో సినిమా చేస్తే తక్కువ ఖర్చుతో అవుతుంది. ఆర్టిస్ట్ లు బాగుంటారు అని నమ్మండి. చిన్న ఆర్టిస్టులను బ్రతికించండి. అరే.. సినిమాలు అనే కాదు ఎదో ఒక అడ్వర్టైజ్ మెంట్ చేద్దాము అనుకున్నా అక్కడ కూడా హీరోలు పోటీపడుతున్నారు. బాత్రూం క్లిన్ చేసే బ్రష్ దగ్గర నుంచి బంగారం వరకు హీరోలే చేస్తున్నారు. ఇక చిన్న ఆర్టిస్టులకు పని ఎక్కడ దొరుకుతుంది. వారి పొట్ట ఎలా నిండుతుంది. నేను చెప్పేది ఒక్కటే. దయచేసి చిన్న ఆర్టిస్టుల పొట్ట కొట్టకండి. ఏదొక విధంగా అలోచించి వారికి పని దొరికేలా చూడండి” అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు(comments) నెట్టింట వైరల్ గా మారాయి. మరి కోటా వ్యాఖ్యలపై మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచి విష్ణు ఎలాంటి నిర్ణయాన్నితీసుకుంటాడో చూడాలి మరి.