AP: అల్లూరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ఘటనాస్థలాన్ని మంత్రి సంధ్యారాణి పరిశీలించారు. ప్రమాదానికి పొగమంచు కూడా కారణం కావొచ్చని మంత్రి తెలిపారు. ఘటనలో 9 మంది మరణించినట్లు వెల్లడించారు. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. చింతూరు PHCకి క్షతగాత్రులను తరలించినట్లు తెలిపారు.