అల్లూరిలో జరిగిన బస్సు ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఓ అంచనాకు రాలేకపోతున్నారు. మలుపు దగ్గర డ్రైవర్ బస్సును కంట్రోల్ చేయలేకపోయారా? ఘాట్ రోడ్డులో జర్నీ డ్రైవర్‌కు కొత్త కావడం వల్లే బోల్తా కొట్టిందా? దట్టమైన పొగమంచుతో దారి కనిపించలేదా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సిగ్నల్ లేని ప్రాంతం కావడంతో బాధితులు 108కి ఫోన్ చేయడం ఆలస్యమైంది.