ASR: చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ఉత్తమ చికిత్స అందించాలని అధికారులకు ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. ఘటనాస్థలానికి ఆమె హుటాహుటిన బయలుదేరి, త్వరలో మారేడుమిల్లికి చేరుకోనున్నారు.