AP: రాజధానిగా అమరావతిని 2024 జూన్ 2 నుంచి చేరుస్తూ విభజన చట్టాన్ని సవరించాలని కూటమి ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు ఎప్పటి నుంచి దాన్ని అమల్లోకి తేవాలో స్పష్టత ఇవ్వాలని కేంద్రం ఈనెల 1న రాష్ట్రానికి లేఖ రాసింది. 2024 జూన్ 2 నుంచి అమరావతి ఏపీ రాజధానిగా ఉంటుందని విభజన చట్టంలోని సెక్షన్ 5(2)లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోంశాఖకు తాజాగా లేఖ పంపారు.