SDPT: జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే ఏడు మండల కేంద్రాల నుంచి పోలింగ్ కేంద్రాలకు బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామాగ్రిని పంపిణీ చేశారు. ఏడు మండలాల్లోని 163గ్రామ పంచాయతీలకు గాను 1,432 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. విధుల్లో 3,973 మంది సిబ్బందిని నియమించారు. నేడు ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు జరుగనున్నాయి. అనంతరం అధికారులు రిజల్ట్ వెల్లడిస్తారు.