NGKL: చారకొండ మండలం కమల్పూర్ తండా గ్రామ పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవంగా పూర్తయింది. గ్రామ ప్రజలు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి రవి నాయకు సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తుర్కలపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు ఏకగ్రీవంగా ఎన్నికైన రవి నాయక్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బొమ్మకంటి రాములు, కట్ట సహదేవ్, పెద్దాపురం జగన్ తదితర నాయకులు పాల్గొన్నారు.