NLR: AP నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కావలి తాలూకా యూనిట్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. ఈ నెల 11వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో నామినేషన్ల కార్యక్రమం జరుగుతుందని ఎన్నికల అధికారి మల్లికార్జునరావు తెలిపారు. ఉద్యోగులందరూ ఈ ఎన్నికల ప్రక్రియలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు.