ADB: ఓటర్లకు డబ్బు పంచుతున్న ఆడే సురేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు CI అంజమ్మ బుధవారం తెలిపారు. నార్నూర్ ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో నార్నూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగిందని వెల్లడించారు. ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అతని వద్ద ఉన్న ₹10 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.