KNR: చొప్పదండి మండలం వెదురుగట్ట గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో ముగ్గురు శ్రీనివాస్ అనే పేరున్న అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వీరి ఇంటి పేర్లు వేర్వేరుగా ఉండటంతో, ఏ శ్రీనివాస్ విజయం సాధిస్తారనే దానిపై మండల వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా ఎన్నికల్లో అభ్యర్థుల పేర్లు వేర్వేరుగా ఉంటాయి, కానీ ఇక్కడ ఒకే పేరుతో ముగ్గురు పోటీ పడటం విశేషం.