KMM: జిల్లాలో తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. ఈ పోరు కేవలం అభ్యర్థులకే కాదు.. MLAలకు, ముఖ్యంగా మంత్రులు మల్లు భట్టి విక్రమార్క (మధిర నియోజకవర్గం),తుమ్మల నాగేశ్వరరావు (ఖమ్మం నియోజకవర్గం) లకు సైతం పెద్ద సవాల్‌గా మారింది. తమ నియోజకవర్గాల్లో ఎక్కువ పంచాయతీలను గెలిపించుకోవడం ద్వారా తమ పట్టును నిరూపించుకోవాలని నాయకులు ప్రయత్నిస్తున్నారు.