టాలీవుడ్ సినీ నటి శ్రియ శరణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన కుమార్తెతో కలిసి వేకువజామున జరిగే అత్యంత పవిత్రమైన సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అధికారులు శ్రియ కుటుంబానికి వేదాశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు.