కర్నూలు జిల్లాలో యువతలో మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి అయ్యప్ప రాష్ట్ర సమితి ముద్రించిన “హలో యువత మేలుకో- చెడు వ్యసనాల నుంచి నిన్ను నువ్వు కాపాడుకో” నినాదంతో వాల్ పోస్టర్లను అదనపు ఎస్పీ హుస్సేన్ పీరా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీఐలు శ్రీధర్, చాంద్ బాషా, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీరాములు, శ్రీనివాసులు, పాల్గొన్నారు