WGL: పర్వతగిరి మండలంలోని అనంతారం, గోపనపల్లి, వడ్లకొండ, రోళ్ళకల్లు, నారాయణపురం గ్రామాల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థులకు మద్దతుగా MLA KR నాగరాజు గడపగడపకు ప్రచారం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. గ్రామాలు మారాలంటే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు.