KNR: ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని జిల్లా సహకార అధికారి ఎస్. రామానుజాచార్య ఆదేశించారు. చేగుర్తి గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఆయన, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం తూకం, ధాన్యం తరలింపు చేసి, చెల్లింపులు పారదర్శకంగా నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు.