వందేమాతరం అంటే ఓ చరిత్ర అని కాంగ్రెప్ ఎంపీ ప్రియాంక గాంధీ అన్నారు. ప్రభుత్వం మాత్రం షరతులు పెట్టి చర్చించాలంటోందని విమర్శించారు. వందేమాతరం దేశంలోని కణ కణంలో జీవించి ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సంస్కరణలపై చర్చించమంటే, ప్రభుత్వం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రసంగాలు గొప్పగా ఇస్తారు, కానీ సత్యాలను మాత్రం దాచిపెడతారని అన్నారు.