ATP: MLA జేసీ అష్మిత్ రెడ్డి శనివారం తాడిపత్రిలో తన స్వగృహంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే, సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన అధికారులు పాల్గొన్నారు. అనంతరం ప్రజా దర్బార్‌కు హాజరైన ప్రజలందరికీ జేసీ అష్మిత్ రెడ్డి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు.