ఇద్దరు భార్యలతో నామినేషన్లు వేయించిన భర్త.. ఎవరిని సర్పంచ్ చేయాలనే సందిగ్ధంలో పడ్డాడు. ఈ పరిస్థితి సిద్దిపేట జిల్లా జంగపల్లికి చెందిన వ్యక్తికి ఎదురైంది. నామినేషన్ పత్రాల్లో ఏవైనా తప్పులుంటే పరిశీలన సమయంలో తొలగిస్తారన్న భయంతోనే ఇద్దరితో నామినేషన్లు వేయించినట్లు అతడు తెలిపాడు. అయితే, వీరిలో ఒకరు నామినేషన్ ఉపసంహరించుకుంటే.. సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది.