NRML: సోన్ మండలం వెల్మల్ గ్రామంలో ఇటీవల ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచ్ చాత్రి గంగాధర్, ఉప సర్పంచ్ ప్రశాంత్ సహా వార్డు సభ్యులు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రామ అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకారం అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.