WGL: కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ వీసీగా రమేశ్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శనివారం బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. యూనివర్సిటీ లక్ష్యాల సాధనకు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.