GNTR: తెనాలికి చెందిన స్వరలయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మహానటి సావిత్రి జయంతిని శనివారం నిర్వహించారు. మారీసుపేటలోని కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు, సభ్యులు పాల్గొని సావిత్రి చిత్రపటం వద్ద నివాళులర్పించారు. సినీ వినీలాకాశంలో అభినేత్రి సావిత్రి ధ్రువతారగా వెలుగొందారని పలువురు కొనియాడారు.