కృష్ణా: పెడనలోని వైసీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి శనివారం ఘనంగా జరిగింది. పెడన వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాల రాము అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ బలహీన వర్గాల కోసం అనేక సంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు. కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.