JN: దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు డా.బీ.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విద్య, సమానత్వం, రాజ్యాంగ విలువలపై ఆయన చూపిన దారిని అనుసరించాలని పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధిలో అంబేద్కర్ భావాలు మార్గదర్శకాలని స్థానికులు పేర్కొన్నారు.