NLR: ఆత్మకూరు పట్టణంలో శుక్రవారం రాత్రి వాహన తనిఖీలు నిర్వహించినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. ఈ సందర్భంగా లైసెన్సులు, వాహనాల పత్రాలు, డ్రైవర్ల స్థితిని పరిశీలించి డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు చేపట్టారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని మద్యం సేవించి వాహనాలు నడపరాదని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.