సత్యసాయి: గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లిలో మారెమ్మ దేవాలయం పూజారి దేవరాజ్ స్వామి గ్రామస్థులు సహకారంతో శనివారం గోశాల ప్రారంభించారు. పూజారి దేవరాజ్ మాట్లాడుతూ.. ఆవుల యొక్క సంఖ్య రోజు రోజుకు తరిగి పోతుందని, వాటిని కాపాడుకోవడం మానవుని యొక్క ప్రథమ కర్తవ్యం కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మాజీ ఎంపీపీ నిమ్మల విద్యాధరణి, తదితరులు పాల్గొన్నారు.