KKD: ప్రభుత్వ బడుల్లో ఏవేవో మార్పులు తీసుకువచ్చేసామని తెలుగుదేశం నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తుని ఎమ్మెల్యే, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా పేర్కొన్నారు. బడుల అభివృద్ధి నుంచి యూనిఫాం వరకు జరగాల్సిన మార్పులన్నీ జగన్ ప్రభుత్వ హయాంలోనే జరిగిపోయిందన్నారు. ఇప్పుడు బడులకు కూటమి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు.