NRPT: ఊట్కూరు మండలం పులిమామిడి గ్రామంలో అక్రమంగా మొరం తరలింపు జరుగుతున్న విషయంపై తహశీల్దార్ రవిని సంప్రదించగా.. మొదట ఇందిరమ్మ ఇళ్లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. అనుమతి పత్రం అడగ్గా సమాధానం దాటవేశారు. ఆ తర్వాత ఆయన ఫోన్ ద్వారా అందుబాటులోకి రావడం లేదని స్థానికులు తెలిపారు. అక్రమ తరలింపును ఆపాలని వారు పై అధికారులను కోరుతున్నారు.