సత్యసాయి: పుట్టపర్తిలో శనివారం ఉదయం శ్రీ సత్య సాయి భక్తులు ఘనంగా గిరిప్రదక్షిణ నిర్వహించారు. స్థానిక గణేష్ గేట్ వద్ద శ్రీ సత్య సాయి రథానికి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు దీపాలతో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 8 కిలోమీటర్ల మేర సాగిన ఈ ప్రదక్షిణ సాయి నామస్మరణతో మార్మోగింది. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.