NRPT: జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ (డీటీవో) మేఘా గాంధీ, ఏఎంవీఐ సాయి తేజ్ రెడ్డి శుక్రవారం నారాయణపేట ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డాక్టర్ వినిత్ను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. రహదారి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాల నివారణ, డ్రైవింగ్ అవగాహన కార్యక్రమాలపై వారు చర్చించారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం కలిసి పని చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.