NZB: జింకను వేటాడి చంపిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు రూరల్ టౌన్ SHO శ్రీనివాస్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. వారం రోజుల క్రితం మల్లారం శివారులో బోర్గాంకు చెందిన గంధం విజయ్, దాసరి వెంకటి, నిమ్మల భూమయ్య, అనిల్ జింకను వేటాడి చంపారు. విజయ్, వెంకటి, భూమయ్యను అరెస్టు చేయగా అనిల్ పరారీలో ఉన్నాడు.