AP: ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు-తల్లిదండ్రుల బృహత్ సమావేశాలు నిర్వహించనున్నారు. మన్యం జిల్లా బామినిలో జరగనున్న ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొంటారు. అలాగే పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో Dy.CM పవన్ విద్యార్థులతో మాట్లాడుతారు. ఉ.10:30 నుంచి మ.2 గం.ల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. పిల్లల జవాబు పత్రాలు, హెల్త్ కార్డులను తల్లిదండ్రులకు అందిస్తారు.