HYD: iBOMMA రవి బెయిల్, కస్టడీ పిటిషన్లపై నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పును వెల్లడించనుంది. కేసు విచారణలో ఉన్నందున, రవికి బెయిల్ మంజూరు చేయవద్దని పోలీసుల తరుపు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన నిర్ణయాన్ని రిజర్వ్ చేసింది. దీంతో రవికి బెయిల్ లభిస్తుందా లేదా అనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.