NRPT: జిల్లాలో జరుగుతున్న ‘చదువుల పండుగ’ కార్యక్రమంలో భాగంగా వేదిక్ మ్యాథ్స్ పోస్టర్, విద్యార్థి వర్క్ బుక్‌ను కలెక్టర్ సిక్తా పట్నాయక్ గురువారం ఆవిష్కరించారు. త్వరిత గణన, విశ్లేషణ సామర్థ్యాలు పెంచడం లక్ష్యంగా.. 10 జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లోని 4,407 మంది విద్యార్థులకు ఈ కార్యక్రమం అందుబాటులోకి రానుందని అధికారులు తెలిపారు.